Wednesday, 22 April 2026
  • Home  
  • బాటసారుల దాహార్తి తీర్చడమే లక్ష్యం ఎమ్మెల్యే బొజ్జల
- తిరుపతి

బాటసారుల దాహార్తి తీర్చడమే లక్ష్యం ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలు, బాటసారుల దాహార్తి తీర్చేందుకు మున్సిపల్ శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. శ్రీకాళహస్తి ఎన్టీఆర్ విగ్రహం వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి చలివేంద్రాన్ని ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ప్రారంభించారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా వాటర్ క్యాంపులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా అవసరమైన మరిన్ని చోట్ల ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ త్రాగునీటి సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, సౌకర్యమే తమ ప్రాధాన్యతని, వేసవి కష్టాల నుండి ఉపశమనం కలిగించేందుకు మరిన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.