Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బహుజనుల అభ్యున్నతే లక్ష్యం.. బసవరాజుపాలెంలో బీఎస్పీ అభ్యర్థి జ్యోతి శ్రీనివాసులు ప్రచార జోరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బహుజనుల అభ్యున్నతే లక్ష్యం.. బసవరాజుపాలెంలో బీఎస్పీ అభ్యర్థి జ్యోతి శ్రీనివాసులు ప్రచార జోరు

ఆత్మకూరు: ఆత్మకూరు మండల జెడ్పీటీసీ ఎన్నికల బరిలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా నిలిచిన జ్యోతి శ్రీనివాసులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మహిమలూరు పంచాయతీ పరిధిలోని బసవరాజుపాలెం గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.బహుజనుల అభ్యున్నతి, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచినట్లు జ్యోతి శ్రీనివాసులు తెలిపారు. ప్రజల కష్టాలను తెలుసుకుని, వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన లభించిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

బహుజనుల అభ్యున్నతే లక్ష్యం.. బసవరాజుపాలెంలో బీఎస్పీ అభ్యర్థి జ్యోతి శ్రీనివాసులు ప్రచార జోరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *