తాళ్లపూడి, జూన్ 5 (పున్నమి ప్రతినిధి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లపూడి గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కల నాటడం కార్యక్రమాన్ని తాళ్లపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నామన పరమేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నామన పరమేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనాన్ని కాపాడడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను కూడా ప్రతి పౌరుడు స్వీకరించాలని సూచించారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అప్పన వీర హనుమంతరావు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మారం కృష్ణ ప్రసాద్ (కేపీ), ప్రొఫెషనల్ వింగ్ సెక్రటరీ కడలి కిరణ్ కుమార్, యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ జొన్నకూటి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విస్తృతంగా మొక్కల నాటడం పచ్చదనం పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత
తాళ్లపూడి, జూన్ 5 (పున్నమి ప్రతినిధి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లపూడి గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కల నాటడం కార్యక్రమాన్ని తాళ్లపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నామన పరమేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నామన పరమేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనాన్ని కాపాడడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను కూడా ప్రతి పౌరుడు స్వీకరించాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్పన వీర హనుమంతరావు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మారం కృష్ణ ప్రసాద్ (కేపీ), ప్రొఫెషనల్ వింగ్ సెక్రటరీ కడలి కిరణ్ కుమార్, యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ జొన్నకూటి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

