వార్త ముఖ్యాంశాలు
- ఆరోగ్యకరమైన తరానికి బలమైన పునాది...
- జిల్లా కలెక్టర్ డా.
- శ్రీధర్ చెరుకూరి పోషకాహార లోపం లేని జిల్లాగా కడపను తీర్చిదిద్దడమే లక్ష్యం మన అంగన్వాడీ–మన బాధ్యత’తో పోషణ మాసం విజయవంతం అంగన్వాడీల బలోపేతానికి సమాజ భాగస్వామ్యం అవసరం కడప, అక్టోబర్ 7 : జిల్లాలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల క్షేత్రస్థాయి…
ఆరోగ్యకరమైన తరానికి బలమైన పునాది…
జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
పోషకాహార లోపం లేని జిల్లాగా కడపను తీర్చిదిద్దడమే లక్ష్యం
మన అంగన్వాడీ–మన బాధ్యత’తో పోషణ మాసం విజయవంతం
అంగన్వాడీల బలోపేతానికి సమాజ భాగస్వామ్యం అవసరం
కడప, అక్టోబర్ 7 : జిల్లాలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది గత కొన్నేళ్లుగా చేస్తున్న సమష్టి కృషి వల్ల ఆరోగ్యం, పోషణకు సంబంధించిన సూచీల్లో గణనీయమైన పురోగతి సాధ్యమైందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి వివరించారు.
బుధవారం కలెక్టరేట్లోని సభాభవన్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ పోషణ మాసం–2026 జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోపాటు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పోషణ మాసం విజయవంతంగా కొనసాగడానికి చేపట్టిన చర్యలను అభినందించారు.