Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తిని శ్రీనివాస్ గౌడ్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తిని శ్రీనివాస్ గౌడ్..

నర్సంపేట ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్చార్జ్ గా నియమితులైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని హైదరాబాద్ లోని వారి నివాసంలో నర్సంపేట మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, పార్టీ బలోపేతంపై చర్చించారు.

నర్సంపేట నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్లను అధిక సంఖ్యలో నమోదు చేసి, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని బత్తిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు రావడం పట్ల నర్సంపేట నియోజకవర్గ brsశ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తిని శ్రీనివాస్ గౌడ్..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *