ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలం: రామాపురం గ్రామంలో నిర్వహించనున్న “పల్లె పండుగ 3.0” కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ విచ్చేయనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు రామాపురంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, వేదిక, ఇతర సదుపాయాలను పరిశీలించి నిర్వాహకులతో వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆల్లూరి రవీంద్ర, రసూల్ పటాన్, కల్లూరి సురేంద్ర రెడ్డి, రవి కుమార్, పాలిశెట్టి శ్రీనివాసులు, కిరణ్, లికిత్, వెంకట ప్రసాద్, నికిల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏర్పాట్లలో పాల్గొన్నారు.


