Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కు ను నమోదు చేసుకోవాలి :బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి

పట్టపద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
———————————————————————
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి ఈరోజు జనగామ బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి విచ్చేసి మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ 2023 నవంబర్ వరకు పట్టభద్రులైన విద్యావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరడం జరిగింది వరంగల్ ఖమ్మం నల్లగొండ నియోజకవర్గానికి గతంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలను గెలిపించినప్పటికీ నిరుద్యోగుల గొంతుక వినిపించలేకపోయారు పట్టపద్రులను నిరుద్యోగులను ఉద్యోగస్తులను విస్మరించినారు ఉపాధ్యాయులకు కనీసం డి ఏ కూడా చెల్లించలేని స్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నది గత ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఒక్క డీఎస్సీ కూడా వెయ్యలేదు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని విద్యావంతులను కోరడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలిపిస్తే కేంద్ర నిధులతోనే ఈ ఉమ్మడి మూడు జిల్లాలను అభివృద్ధి చేస్తాము అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరుట్ల దశమంత రెడ్డి విద్యాసాగర్ రెడ్డి ఉడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ బల్ల శ్రీనివాస్ బొజ్జపల్లి సుభాష్ తోకల ఉమారాణి ఐలోని అంజిరెడ్డి పల్లె కుమారు రంగు రాములు బురుగు సురేష్ గౌడ్ చింతకింది సంతోష్ జీవనజ్యోతి పెద్దోజు జగదీష్ ఎలా బోయిన హరీష్ కళ్యాణి ఉమాదేవి స్వప్న రమాదేవి దూసరి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *