నేటి నుండి ఉప్పల్ రింగ్ రోడ్ బంద్
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జి
27 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా
ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన అధికారులు
ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద హన్మకొండ వైపు వెళ్ళే బస్సులు ఆగే బస్టాండ్‌ను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌కు మార్చినట్లు, నేటి నుండి అక్కడే బస్సులు ఆగుతాయని అధికారుల ప్రకటన
బోడుప్పల్ వైపు నుండి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుండి భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచన
సికింద్రాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ నుండి నాచారం ద్వారా చెంగిచర్ల చేరుకుని అక్కడి నుండి జాతీయ రహదారి చేరుకోవాలని, చిన్న వాహనాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుండి రహదారికి చేరుకోవాలని సూచనలు..


