Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో విషాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నెల్లూరులో విషాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9వ బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రసన్నకుమార్ మృతిచెందారు.
  • బెటాలియన్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐ తల్లి మృతిచెందడంతో, ఆమె అంత్యక్రియల నిమిత్తం ఆర్‌ఎస్‌ఐను హెడ్ కానిస్టేబుల్ కారులో నెల్లూరుకు తీసుకొచ్చారు.
  • కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి వెంకటగిరి వైపు వెళ్తుండగా డక్కిలి మండలం సంగనపల్లి సమీపంలో రహదారి పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.

నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9వ బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రసన్నకుమార్ మృతిచెందారు. బెటాలియన్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐ తల్లి మృతిచెందడంతో, ఆమె అంత్యక్రియల నిమిత్తం ఆర్‌ఎస్‌ఐను హెడ్ కానిస్టేబుల్ కారులో నెల్లూరుకు తీసుకొచ్చారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి వెంకటగిరి వైపు వెళ్తుండగా డక్కిలి మండలం సంగనపల్లి సమీపంలో రహదారి పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం. ప్రసన్నకుమార్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వారు నాయుడుపేటలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సహచర సిబ్బందిలో విషాదం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *