Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నీటి పొదుపుపై ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నీటి పొదుపుపై ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన

వార్త ముఖ్యాంశాలు

  • నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
  • బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులతో గేట్ మీటింగ్ నిర్వహించారు.
  • ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యత, వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యత, వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం ఉద్యోగులందరితో బ్రిక్స్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే సుస్థిర జీవనశైలి విధానాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిపో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *