వార్త ముఖ్యాంశాలు
- -అనుమతుల మేరకే లేఅవుట్ల నిర్మాణాలు చేపట్టాలి నగరపాలక సంస్థ అనుమతులు, నిబంధనల మేరకే లేఅవుట్ల నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్ వై.ఓ.
- నందన్ సూచించారు.
- శనివారం ఇస్కాన్ సిటీ కావేరీ నగర్ ప్రాంతంతోపాటు గుడిపల్లిపాడులోని సాయి బృందావనం స్మార్ట్ సిటీలో నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్లను సిటీ ప్లానర్ రఘునాథరావుతో కలిసి పరిశీలించారు.
-అనుమతుల మేరకే లేఅవుట్ల నిర్మాణాలు చేపట్టాలి
నగరపాలక సంస్థ అనుమతులు, నిబంధనల మేరకే లేఅవుట్ల నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్ వై.ఓ. నందన్ సూచించారు. శనివారం ఇస్కాన్ సిటీ కావేరీ నగర్ ప్రాంతంతోపాటు గుడిపల్లిపాడులోని సాయి బృందావనం స్మార్ట్ సిటీలో నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్లను సిటీ ప్లానర్ రఘునాథరావుతో కలిసి పరిశీలించారు.
లేఅవుట్లకు సంబంధించిన అనుమతులు, ప్లాన్లు, ఇతర పత్రాలను కమిషనర్ తనిఖీ చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులకు అనుగుణంగా పనులు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. లేఅవుట్లలో నిర్దేశించిన అన్ని వసతులు కల్పించేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
డివిజన్లలో డ్రెయిన్ల పూడికతీత, వ్యర్థాల తొలగింపు క్రమం తప్పకుండా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. రానున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై నీరు నిలవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలని ఆదేశించారు.
కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగం టీపీబీఓలు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.