Thursday, 21 May 2026
  • Home  
  • నిద్రమత్తులో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు*
- ఖమ్మం

నిద్రమత్తులో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు*

*టిఫిన్ సెంటర్లలో డొమెస్టిక్ సిలిండర్ల దందా: సబ్సిడీ దొబ్బేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం* *నిద్రమత్తులో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు* వాణిజ్య సిలిండర్‌కు బదులు గృహ సిలిండర్ వాడకం – నెలకు రూ. లక్షలలో ప్రభుత్వనికి నష్టం ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: ఏన్కూరు మండల వ్యాప్తంగా టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు, బిర్యానీ పాయింట్లు నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల కోసం ఇచ్చే డొమెస్టిక్ LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు యథేచ్ఛగా వాడేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి సబ్సిడీ రూపంలో లక్షల్లో నష్టం వాటిల్లడమే కాకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. డొమెస్టిక్ సిలిండర్ 14.2kg కమర్షియల్ సిలిండర్ 19kg ధర రూ.803 సబ్సిడీతో రూ.1745 సబ్సిడీ లేదు ఇంటి అవసరాలకు ఎరుపు రంగు మాత్రమే వాడాలి హోటళ్లు, వ్యాపారాలకు నీలం/ముదురు వాడాలి ఎరుపు వ్యాపారానికి వాడకం నేరం తప్పనిసరి ఒక్కో డొమెస్టిక్ సిలిండర్‌పై ప్రభుత్వం రూ.300 సబ్సిడీ భరిస్తోంది. హోటల్ వాళ్లు కమర్షియల్ సిలిండర్ రూ.1745 పెట్టి కొనకుండా, డొమెస్టిక్ సిలిండర్‌ను బ్లాక్‌లో రూ.1100కి కొని రూ.645 మిగుల్చుకుంటున్నారు. సేఫ్టీ క్యాప్, రెగ్యులేటర్ ISI మార్క్ లేకుండా వాడుతున్నారు” పేలుడు ప్రమాదం: కమర్షియల్ వాడకానికి డొమెస్టిక్ రెగ్యులేటర్ సరిపోదు. లీకేజీ అయ్యి పేలిపోయే ఛాన్స్ ఎక్కువ. సబ్సిడీ దుర్వినియోగం: నిజమైన లబ్ధిదారులైన పేదలకు సిలిండర్లు అందకుండా పోతున్నాయి. ప్రభుత్వ నష్టం: ఏన్కూరు మండలంలో సుమారు నెలకు 200 నుండి 400 వరకు డొమెస్టిక్ సిలిండర్లు అక్రమంగా హోటళ్లకు తరలుతున్నాయని అంచనా. దీనివల్ల నెలకు రూ. లక్ష రూపాయల వరకు ఏడాదికి 25 లక్షల వరకు సబ్సిడీ నష్టం. LPG కంట్రోల్ ఆర్డర్ 2000 & ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ప్రకారం: మొదటిసారి: రూ.10,000 జరిమానా + సిలిండర్లు సీజ్ రెండోసారి: రూ.25,000 జరిమానా + 3 నెలల షాప్ సీజ్ మూడోసారి: లైసెన్స్ రద్దు + 6 నెలల నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఇటువంటి కఠిన శిక్షలు చట్టం ప్రకారం ఉన్నప్పటికీ గాని టిఫిన్ సెంటర్ మరియు హోటల్ యాజమాన్యానికి భయమనేది లేకుండా పోయింది గ్యాస్ ఏజెన్సీల మోసం: కొందరు గ్యాస్ డీలర్లు కమీషన్ కోసం హోటళ్లకు డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. అటువంటి ఏజెన్సీలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏన్కూరు మండలంలో తనిఖీలు చేసినట్టు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు కూడా లేదు మరి ఈ అధికారులకు హోటల్ యాజమాన్యాలు అంటే అంత ప్రేమ ఎందుకో అని మండల ప్రజలు వీరిపై అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా మండలంలో తనిఖీలు నిర్వహించి అక్రమ వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు

*టిఫిన్ సెంటర్లలో డొమెస్టిక్ సిలిండర్ల దందా: సబ్సిడీ దొబ్బేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం*

*నిద్రమత్తులో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు*

వాణిజ్య సిలిండర్‌కు బదులు గృహ సిలిండర్ వాడకం – నెలకు రూ. లక్షలలో ప్రభుత్వనికి నష్టం

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి
గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు:

ఏన్కూరు మండల వ్యాప్తంగా టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు, బిర్యానీ పాయింట్లు నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల కోసం ఇచ్చే డొమెస్టిక్ LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు యథేచ్ఛగా వాడేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి సబ్సిడీ రూపంలో లక్షల్లో నష్టం వాటిల్లడమే కాకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
డొమెస్టిక్ సిలిండర్ 14.2kg కమర్షియల్ సిలిండర్ 19kg
ధర రూ.803 సబ్సిడీతో రూ.1745 సబ్సిడీ లేదు
ఇంటి అవసరాలకు ఎరుపు రంగు మాత్రమే వాడాలి
హోటళ్లు, వ్యాపారాలకు
నీలం/ముదురు వాడాలి
ఎరుపు
వ్యాపారానికి వాడకం నేరం తప్పనిసరి
ఒక్కో డొమెస్టిక్ సిలిండర్‌పై ప్రభుత్వం రూ.300 సబ్సిడీ భరిస్తోంది. హోటల్ వాళ్లు కమర్షియల్ సిలిండర్ రూ.1745 పెట్టి కొనకుండా, డొమెస్టిక్ సిలిండర్‌ను బ్లాక్‌లో రూ.1100కి కొని రూ.645 మిగుల్చుకుంటున్నారు.
సేఫ్టీ క్యాప్, రెగ్యులేటర్ ISI మార్క్ లేకుండా వాడుతున్నారు”

పేలుడు ప్రమాదం:

కమర్షియల్ వాడకానికి డొమెస్టిక్ రెగ్యులేటర్ సరిపోదు. లీకేజీ అయ్యి పేలిపోయే ఛాన్స్ ఎక్కువ.

సబ్సిడీ దుర్వినియోగం:

నిజమైన లబ్ధిదారులైన పేదలకు సిలిండర్లు అందకుండా పోతున్నాయి.

ప్రభుత్వ నష్టం:

ఏన్కూరు మండలంలో సుమారు నెలకు 200 నుండి 400 వరకు డొమెస్టిక్ సిలిండర్లు అక్రమంగా హోటళ్లకు తరలుతున్నాయని అంచనా. దీనివల్ల నెలకు రూ. లక్ష రూపాయల వరకు ఏడాదికి 25 లక్షల వరకు సబ్సిడీ నష్టం.

LPG కంట్రోల్ ఆర్డర్ 2000 & ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ప్రకారం: మొదటిసారి: రూ.10,000 జరిమానా + సిలిండర్లు సీజ్
రెండోసారి: రూ.25,000 జరిమానా + 3 నెలల షాప్ సీజ్
మూడోసారి: లైసెన్స్ రద్దు + 6 నెలల నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఇటువంటి కఠిన శిక్షలు చట్టం ప్రకారం ఉన్నప్పటికీ గాని టిఫిన్ సెంటర్ మరియు హోటల్ యాజమాన్యానికి భయమనేది లేకుండా పోయింది

గ్యాస్ ఏజెన్సీల మోసం:

కొందరు గ్యాస్ డీలర్లు కమీషన్ కోసం హోటళ్లకు డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. అటువంటి ఏజెన్సీలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
ఏన్కూరు మండలంలో తనిఖీలు చేసినట్టు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు కూడా లేదు మరి ఈ అధికారులకు హోటల్ యాజమాన్యాలు అంటే అంత ప్రేమ ఎందుకో అని మండల ప్రజలు వీరిపై అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా మండలంలో తనిఖీలు నిర్వహించి అక్రమ వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.