Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నార్కోటిక్ ట్రేడ్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పోలీస్ డాగ్ ‘మాయ’

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ఆడ పోలీస్ డాగ్ ‘మాయ’ తన శిక్షణలో ప్రతిభ కనబరిచి నార్కోటిక్ ట్రేడ్‌లో సిల్వర్ మెడల్ సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మాయ ఈ రోజు జిల్లాకు చేరుకుని ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ గారికి గౌరవ వందనం చేసింది. మాయ సాధించిన విజయంపై ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్, DSWO/RI శ్రీ కోటేశ్వరరావు మాయతో పాటు ఆమె హ్యాండ్లర్లను అభినందించారు. నార్కోటిక్ పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో శిక్షణ పొందిన పోలీస్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. మాయ విజయం కోనసీమ జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *