செய்தியின் முக்கிய அம்சங்கள்
- Uploaded Video:
అంబేద్కర్ కోనసీమ జిల్లా: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆలమూరు మండలం తాళ్లపొలం, ఆలమూరు గ్రామాల్లోని ఇటుక బట్టీలను శుక్రవారం కార్మిక శాఖ అధికారులతో కలిసి మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని బట్టీల్లో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించడంతో ఆరుగురు యజమానులపై కేసులు నమోదు చేశారు. బాలల తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి, పిల్లలను పనులకు పంపకుండా పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. బాల కార్మికులతో పనిచేయిస్తే ఉపేక్షించబోమని యజమానులను హెచ్చరించారు. ప్రజలంతా సామాజిక బాధ్యతతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.
Uploaded Video:
