Tuesday, 22 September 2026
  • Home  
  • నల్లజర్లలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు
- తూర్పు గోదావరి

నల్లజర్లలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

నల్లజర్లలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నల్లజర్ల మండలo పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20: నల్లజర్ల, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నల్లజర్లలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటరాజు ఆదివారం ప్రారంభించారు. ఏలూరుకు చెందిన ఆయుష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, నల్లజర్లలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మండపం సహకారంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని, తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యానికి, సహకారం అందించిన స్వామి వారి కళ్యాణ మండపం నిర్వాహకులకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అభినందనలు తెలిపారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి

నల్లజర్లలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం

నల్లజర్ల మండలo పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20:

నల్లజర్ల, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నల్లజర్లలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటరాజు ఆదివారం ప్రారంభించారు.
ఏలూరుకు చెందిన ఆయుష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, నల్లజర్లలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మండపం సహకారంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని, తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యానికి, సహకారం అందించిన స్వామి వారి కళ్యాణ మండపం నిర్వాహకులకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అభినందనలు తెలిపారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.