Friday, 29 May 2026
  • Home  
  • నక్కర్త గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణానికి ఉదార విరాళం
- E-పేపర్

నక్కర్త గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణానికి ఉదార విరాళం

నక్కర్త గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణానికి ఉదార విరాళం పున్నమి న్యూస్ 29 మే 2026 తెలంగాణ ఇంచార్జి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త గ్రామ ప్రజల ఆరాధ్యదైవం అయిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి గ్రామానికి చెందిన ప్రముఖ కుటుంబ సభ్యులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ భక్తి చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు ముంత పెద్దయ్య స్మారకార్థం, ముంత పార్వతమ్మ కుమారులు ముంత రవి & నవనీత దంపతులు, ముంత గణేష్ & మనస్విని దంపతులు అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం కోసం తమ వంతు భక్తి సహాయంగా రూ.50,000/- (యాభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు. గ్రామ దేవత పట్ల ఉన్న వారి భక్తి భావం, గ్రామ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, ఆలయ పునర్నిర్మాణానికి చూపిన సహకారం గ్రామ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచింది. వారి కుటుంబ సభ్యుల సేవాభావాన్ని గ్రామ పెద్దలు, యువత, భక్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో సహకరించిన ముంత కుటుంబ సభ్యులకు శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి కుటుంబం ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని గ్రామ ప్రజలందరూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. “దేవాలయ నిర్మాణానికి చేసిన ప్రతి సహాయం భక్తికి నిదర్శనం” నక్కర్త గ్రామ ప్రజలు, దేవాలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు కోరుకుంటూ ధన్యవాదములు.

నక్కర్త గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణానికి ఉదార విరాళం

పున్నమి న్యూస్
29 మే 2026
తెలంగాణ ఇంచార్జి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త గ్రామ ప్రజల ఆరాధ్యదైవం అయిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి గ్రామానికి చెందిన ప్రముఖ కుటుంబ సభ్యులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ భక్తి చాటుకుంటున్నారు.
ఈ సందర్భంగా కీర్తిశేషులు ముంత పెద్దయ్య స్మారకార్థం, ముంత పార్వతమ్మ కుమారులు
ముంత రవి & నవనీత దంపతులు,
ముంత గణేష్ & మనస్విని దంపతులు
అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం కోసం తమ వంతు భక్తి సహాయంగా రూ.50,000/- (యాభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.
గ్రామ దేవత పట్ల ఉన్న వారి భక్తి భావం, గ్రామ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, ఆలయ పునర్నిర్మాణానికి చూపిన సహకారం గ్రామ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచింది. వారి కుటుంబ సభ్యుల సేవాభావాన్ని గ్రామ పెద్దలు, యువత, భక్తులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో సహకరించిన ముంత కుటుంబ సభ్యులకు శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి కుటుంబం ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని గ్రామ ప్రజలందరూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు.
“దేవాలయ నిర్మాణానికి చేసిన ప్రతి సహాయం భక్తికి నిదర్శనం”
నక్కర్త గ్రామ ప్రజలు,
దేవాలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు
కోరుకుంటూ ధన్యవాదములు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.