పెద్ద అంబర్‌పేట, అక్టోబర్ 13: పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని రేణుక గోల్డెన్ సిటీలో నెలకొన్న డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాలనీలో డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ స్తంభాలకు సంబంధించిన ఇబ్బందులతో స్థానిక ప్రజలు పడుతున్న అవస్థలను జీఎస్ సేవా సమితి చైర్మన్, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ గ్యారల శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేసినట్లు గ్యారల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
— గ్యారల శ్రీనివాస్ గౌడ్
చైర్మన్, జీఎస్ సేవా సమితి
మాజీ కౌన్సిలర్, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ


