వార్త ముఖ్యాంశాలు
- జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో జెడ్పీహెచ్ఎస్ యానంబైలు పాఠశాలకు చెందిన విద్యార్థి బి.
- చరణ్ షాట్‌పుట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చాడు.
- ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.
జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో జెడ్పీహెచ్ఎస్ యానంబైలు పాఠశాలకు చెందిన విద్యార్థి బి. చరణ్ షాట్‌పుట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చాడు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. ప్రకాష్ రావు, వైస్ ప్రిన్సిపాల్ డి. సాగర్ ఫణి, పీడీ ఏ. వెంకటేశ్వర్లు, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థి చరణ్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అలాగే గ్రామ సర్పంచ్ సుప్రియ గారు కూడా విద్యార్థి చరణ్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ, పాఠశాలకు మరియు గ్రామానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు.
విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులను గ్రామస్థులు అభినందించారు.
వార్తా మూలాలు
- Reporterపత్రికా ప్రకటన