ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ జీవో వల్ల తమ ఉపాధి, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి జీవో-396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

జీవో-396 రద్దు చేయాలంటూ ఉదయగిరిలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన