Sunday, 19 April 2026
  • Home  
  • జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి
- తిరుపతి

జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఏప్రిల్ 15న శ్రీకాళహస్తిలోని జేఎన్టీయూఏ–శ్రీ కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (JNTUA-SKIT) ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ జాబ్ మేళాలో శ్రీ సిటీ, మేనకూరు సెజ్, ఈఎంసి క్లస్టర్, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు చెందిన 40కి పైగా బహుళజాతి సంస్థలు పాల్గొని సుమారు 2400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 5వ తరగతి నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ 14గా నిర్ణయించినట్లు తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అడ్మిట్ కార్డ్‌తో రావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8919889609, 7989509540, 9988853335 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మునిరాజ నాయుడు, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ లక్ష్మీ మోహన్, ఈఎస్సీ కోఆర్డినేటర్ వినయ్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.