సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు. నాయుడుపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమిస్తున్నట్లు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతి గ్రామంలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

జనసేన బలోపేతమే లక్ష్యం: ఉయ్యాల ప్రవీణ్ పిలుపు