అంబేద్కర్ కోనసీమ జిల్లా: నాలుగు నెలల చిన్నారి గుండెలో పెద్ద రంధ్రం ఉండటంతో అత్యవసరంగా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైంది. విషయం తెలుసుకున్న మంత్రి సుభాష్ వెంటనే స్పందించి చిన్నారి చికిత్సకు అండగా నిలిచారు. చిన్నారి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి స్వయంగా వెళ్లి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాప ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పేద తల్లిదండ్రులకు పెద్దదిక్కుగా నిలిచిన మంత్రి సుభాష్, ఎల్ఓసీతో పాటు ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులను కూడా భరిస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, చిన్నారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను, వైద్యులను కోరారు. మంత్రి భరోసాతో చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Uploaded Video:

