వార్త ముఖ్యాంశాలు
- చెన్నారావుపేట: మండలంలోని గురిజాల గ్రామంలో మొబైల్ ఐసీటీసీ ఆధ్వర్యంలో డాక్టర్ సరోజ పర్యవేక్షణలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ప్రజలకు వివిధ ఆరోగ్య సమస్యలు, వైరస్ల నివారణ, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
- అనంతరం ప్రజలకు స్వచ్ఛందంగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా సుమారు 80 మంది పరీక్షలు చేయించుకున్నారు.
చెన్నారావుపేట: మండలంలోని గురిజాల గ్రామంలో మొబైల్ ఐసీటీసీ ఆధ్వర్యంలో డాక్టర్ సరోజ పర్యవేక్షణలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వివిధ ఆరోగ్య సమస్యలు, వైరస్ల నివారణ, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలకు స్వచ్ఛందంగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా సుమారు 80 మంది పరీక్షలు చేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడం పట్ల వైద్య సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సరోజ, మొబైల్ ఐసీటీసీ కౌన్సిలర్ కుమారస్వామి, లింక్ వర్కర్ మంజుల సుభాషిణి, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.