Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

గుడుంబాపై పోలీసుల కొరడా!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుడుంబాపై పోలీసుల కొరడా!

150 ఇళ్ల తనిఖీ.. 15 లీటర్ల గుడుంబా స్వాధీనం.. 800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
ఖానాపురం పున్నమి ప్రతినిధి:(పున్నమి ప్రతినిధి):
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్నయ్యలపూర్ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150 ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 20 వాహనాలను గుర్తించారు. అలాగే 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, సుమారు 800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ వినయ్ తెలిపారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

గుడుంబాపై పోలీసుల కొరడా!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *