భద్రాచలం శ్రీ సీత రాముల వారి దర్శనం కొరకు కుటుంబ సభ్యులతో కలిసి
వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు ఖమ్మం నగరంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సీనియర్ నాయకులు ఖమ్మం వాజపాయి గేంటెల విద్యాసాగర్ ల తో పాటు జిల్లాకు చెందిన పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయ్కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. .



