. మండవల్లిలో ఏఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సదస్సు
మండవల్లి జూన్ 4:
స్థానిక నాగేంద్రస్వామి ఆలయం వద్ద గురువారం కొత్త క్రిమినల్ చట్టాలు, మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన ‘శక్తి’ యాప్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఏఎస్ఐ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని, దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త చట్టాల ముఖ్యాంశాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాత చట్టాల స్థానంలో వచ్చిన
భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS), మరియు భారతీయ సాక్ష్యాధార చట్టం (BSA) ల వల్ల న్యాయవ్యవస్థలో వచ్చిన కీలక మార్పులను, పౌరుల హక్కులను సులభంగా అర్థమయ్యేలా చెప్పారు
“మహిళల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’ యాప్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ యాప్‌ను వినియోగించడం ద్వారా తక్షణమే పోలీసు సహాయం పొందవచ్చు.” అని ఏఎస్ఐ రాజు పేర్కొన్నారు.
ప్రజలందరూ చట్టాలపై కనీస అవగాహన పెంపొందించుకోవాలని, మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను మరియు యాప్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ఈ అవగాహన సదస్సులో పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో గ్రామస్థులు అడిగిన పలు సందేహాలకు ఏఎస్ఐ రాజు నివృత్తి చేశారు.


