Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాట్లు పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ లక్ష్మి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాట్లు పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ లక్ష్మి

*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

* కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

* రేపటిలోగా (అక్టోబర్ 30) అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి

* పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిని స్పష్టంగా మార్కింగ్ చేయాలి

* ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: అధికారులకు కలెక్టర్ ఆదేశం

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కీలక కేంద్రాలను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయా లేదా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముందుగా కొండపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ ఏర్పాటు చేసిన బ్యాలెట్ పంపిణీ కేంద్రం, బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, బ్యాలెట్ పత్రాల భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున ఏజెంట్లు, సిబ్బంది రాకపోకలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. డీఏవీ పబ్లిక్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, షామియానాలు, ర్యాంపుల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో తప్పనిసరిగా మార్కింగ్ చేయాలని, ఆ పరిధిలోకి అనధికార వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబర్ 30వ తేదీ లోపుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని పాలనాపరమైన, సాంకేతిక ఏర్పాట్లను నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు, స్థానిక మున్సిపల్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాట్లు పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ లక్ష్మి

కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాట్లు పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ లక్ష్మి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *