Thursday, 10 September 2026
  • Home  
  • కుబీర్‌లో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు రంగురంగుల అలంకరణలతో ముస్తాబైన బసవన్నలు….బాజాభజంత్రీలతో ఘనంగా ర్యాలీ.
- నిర్మల్

కుబీర్‌లో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు రంగురంగుల అలంకరణలతో ముస్తాబైన బసవన్నలు….బాజాభజంత్రీలతో ఘనంగా ర్యాలీ.

కుబీర్: (సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి .) మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం పోలాల అమావాస్యను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు బసవన్నలను రంగురంగుల వస్త్రాలు, పూలమాలలు, అలంకరణలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు.కుబీర్‌లో వివేకానంద చౌరస్తా నుంచి బసవన్నలతో బాజాభజంత్రీల నడుమ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ విఠలేశ్వర ఆలయానికి చేరుకుంది. అనంతరం హనుమాన్ ఆలయం చుట్టూ బసవన్నలతో ప్రదర్శన నిర్వహించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత బసవన్నలను ఇళ్లకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. వేడుకల్లో రైతులు, మహిళలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.