వార్త ముఖ్యాంశాలు
- కుటుంబ కలహాలే కారణమని అనుమానం నెల్లూరు జిల్లా, నవంబర్ 16 (పున్నమి): నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
- అబ్బు అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
- కుటుంబ కలహాల నేపథ్యంలోనే యువకుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
కుటుంబ కలహాలే కారణమని అనుమానం
నెల్లూరు జిల్లా, నవంబర్ 16 (పున్నమి):
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అబ్బు అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే యువకుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో కరటంపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.