Monday, 20 April 2026
  • Home  
  • ఒలింపియాడ్‌లో ‘ది స్కూల్’ ఘనవిజయం
- తిరుపతి

ఒలింపియాడ్‌లో ‘ది స్కూల్’ ఘనవిజయం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ది స్కూల్ విద్యార్థులు ముంబైలోని ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ సంస్థ ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి మ్యాథ్స్, సైన్స్ పోటీ పరీక్షల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాల కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ప్రధాన ఉపాధ్యాయురాలు పి. విశాల గర్వంగా ప్రకటించారు. ఫైనల్ రౌండ్‌లో భాగంగా జరిగిన కఠినమైన పరీక్షల్లో 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ మేధస్సుతో బంగారు, వెండి, రజత పతకాలను కొల్లగొట్టారు. ముఖ్యంగా మ్యాథ్స్‌లో 6వ తరగతి విద్యార్థిని బి. శ్రీవర్షిత, సైన్స్‌లో 7వ తరగతి విద్యార్థి ఆర్. యోగదీప్ రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. వీరు సాధించిన ప్రతిభకు గానూ సంస్థ తరపున నగదు బహుమతులను అందుకున్నట్లు హెచ్.ఎం తెలిపారు. వీరితో పాటు మరో ఆరుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన ‘ఎక్సలెన్స్ అవార్డులను’ దక్కించుకున్నారని ఆమె వివరించారు. జాతీయ స్థాయి పోటీలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నామని, ఉపాధ్యాయ బృందం కృషితోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలైన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.