Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి! : ఆనం రామనారాయణరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి! : ఆనం రామనారాయణరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్ 28 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ–ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
  • మర్రిపాడు మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిపాడు మండల కేంద్రంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఎన్డీఏ కూటమి సమావేశంలో మంత్రి…
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఆత్మకూరు, అక్టోబర్ 28 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ–ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మర్రిపాడు మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిపాడు మండల కేంద్రంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఎన్డీఏ కూటమి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లను నేరుగా కలవాలని సూచించారు.అనంతరం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కూటమి అభ్యర్థులతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.మంత్రి ఆనం మాట్లాడుతూ, ఎన్నికలు కేవలం అభ్యర్థుల పోరాటం మాత్రమే కాదని, ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకోవాల్సిన కార్యక్రమమని పేర్కొన్నారు. “కూటమి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కదిలి ప్రతి ఇంటికీ వెళ్లాలి. ప్రతి ఓటరును కలుసుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి. కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.మర్రిపాడు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రతి వార్డులోనూ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రచారంలో ప్రతి నాయకుడు బాధ్యత తీసుకుని నిరంతరం ప్రజల్లో ఉండాలని, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.“మన లక్ష్యం ప్రతి స్థానంలో కూటమి విజయం సాధించడమే. కార్యకర్తలే మన బలం. అభివృద్ధిని ప్రజలకు వివరించి వారి విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేయాలి” అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *