వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు: ఆత్మకూరు పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విజయం సాధించడంతో పాటు, మెజారిటీ వార్డు కౌన్సిలర్ స్థానాలను ఎన్డీయే కూటమి కైవసం చేసుకోవడంతో పట్టణంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి.పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపం వద్ద ఉన్న ఎన్డీయే కూటమి…
- ఈ సందర్భంగా భారీగా బాణాసంచా కాల్చి, ఆనందోత్సాహాలతో విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు.కూటమి అభ్యర్థుల విజయంతో నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
- ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆత్మకూరు: ఆత్మకూరు పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విజయం సాధించడంతో పాటు, మెజారిటీ వార్డు కౌన్సిలర్ స్థానాలను ఎన్డీయే కూటమి కైవసం చేసుకోవడంతో పట్టణంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి.పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపం వద్ద ఉన్న ఎన్డీయే కూటమి కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీగా బాణాసంచా కాల్చి, ఆనందోత్సాహాలతో విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు.కూటమి అభ్యర్థుల విజయంతో నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామని పేర్కొన్నారు.విజయోత్సవ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.