Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

అర్ధరాత్రి సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు.. ఇద్దరు నిందితుల అరెస్ట్! మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చోరీ ఫోన్లు కొనుగోలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అర్ధరాత్రి సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు.. ఇద్దరు నిందితుల అరెస్ట్! మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చోరీ ఫోన్లు కొనుగోలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

గాజువాక, అక్టోబర్ 30 (పున్నమి ప్రతినిధి):

షీలానగర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా వెళుతున్న వ్యక్తుల నుంచి సెల్‌ఫోన్లు లాక్కొని పరారవుతున్న నిందితుల్లో ఇద్దరిని సౌత్ సబ్‌ డివిజన్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్టు 18న షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి రోడ్డులో లారీ డ్రైవర్ డొంక రాము వద్ద నుంచి ముగ్గురు వ్యక్తులు సెల్‌ఫోన్ లాక్కొని పరారయ్యారు. అదే ప్రాంతంలో మరో రెండు ఫోన్లను కూడా అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి, అక్టోబర్ 28న ఆటోనగర్ అన్నా క్యాంటీన్ వద్ద కాళ్ల శేఖర్, పెంటకోట నరసింహనాయుడులను అదుపులోకి తీసుకున్నాయి. చెడు వ్యసనాలు, జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చోరీ చేసిన ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించాలనే ఉద్దేశంతో నరసింహనాయుడు వాటిని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల నుంచి ఒక శామ్‌సంగ్, ఒక మోటరోలా, ఒక ఐటెల్ టెక్నో ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Uploaded Video:

అర్ధరాత్రి సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు.. ఇద్దరు నిందితుల అరెస్ట్! మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చోరీ ఫోన్లు కొనుగోలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *