వార్త ముఖ్యాంశాలు
- రూ.117 కోట్లతో రోడ్లు, తాగునీటి పనులు చేపట్టాం: మంత్రి ఆనం డాక్టర్ షకీలా సహా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం
రూ.117 కోట్లతో రోడ్లు, తాగునీటి పనులు చేపట్టాం: మంత్రి ఆనం
డాక్టర్ షకీలా సహా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం
ఆత్మకూరు, అక్టోబర్ 27 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. 12వ వార్డు అభ్యర్థి గడ్డం అమరావతి, 11వ వార్డు అభ్యర్థి కొలగాని ప్రశాంతికి మద్దతుగా ప్రచారం చేస్తూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గతంలోనూ, ముఖ్యంగా గత రెండేళ్లలో ఆత్మకూరు అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం పలు కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. సుమారు రూ.117 కోట్లతో సిమెంట్ రోడ్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం తదితర పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఆత్మకూరులో 100 పడకల ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాల, బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు, సోమశిల జలాలను పట్టణానికి తీసుకురావడం, బైపాస్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్ల రహదారి అభివృద్ధి వంటి కార్యక్రమాలకు కృషి చేశామని మంత్రి వివరించారు. పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లగా, అదనంగా రూ.29 కోట్లతో పనులు చేపట్టేందుకు సూచించారని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు అభివృద్ధి పనులను పరిశీలించి, పట్టణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఆత్మకూరు మరింత అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మంత్రి ఆనం విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, ప్రజల సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, ఆత్మకూరు పట్టణ టిడిపి అధ్యక్షులు తుమ్మల చంద్ర రెడ్డి, టిడిపి యువ నాయకులు డాక్టర్ కోడూరు శ్రవణ్ కుమార్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు.
