వార్త ముఖ్యాంశాలు
- అనారోగ్యంతో మృతి చెందిన వార్డు సభ్యుడి అల్లుడికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు తొర్రూరు: తొర్రూరు మండలం గుర్తూరు గ్రామ పంచాయతీ ఫస్ట్ వార్డు సభ్యుడు కస్తూరి ఈశ్వర్ అల్లుడు అనారోగ్యంతో నెల్లికుదురు మండలం కాశికల్ గ్రామంలో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
- ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, పార్టీ యువ నాయకులు కాశికల్ గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
- అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అనారోగ్యంతో మృతి చెందిన వార్డు సభ్యుడి అల్లుడికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు
తొర్రూరు: తొర్రూరు మండలం గుర్తూరు గ్రామ పంచాయతీ ఫస్ట్ వార్డు సభ్యుడు కస్తూరి ఈశ్వర్ అల్లుడు అనారోగ్యంతో నెల్లికుదురు మండలం కాశికల్ గ్రామంలో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, పార్టీ యువ నాయకులు కాశికల్ గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆప్తుడిని కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ కష్ట సమయంలో తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులు ఒకరికొకరు తోడుగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
– పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్
మరిపెడ, మహబూబాబాద్ జిల్లా.