Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

అధిష్టానం ఆదేశిస్తే సర్పంచ్ గా పోటీచేస్తా!!!!ప్రముఖ వ్యాపారవేత్త షంషూర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అధిష్టానం ఆదేశిస్తే సర్పంచ్ గా పోటీచేస్తా!!!!ప్రముఖ వ్యాపారవేత్త షంషూర్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 2(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో, తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ వాతావరణం వేడిగానే వుంది..
  • వాతావరణం వేడిగా ఉండటానికి కారణం ప్రకృతి విపత్తు ఎల్నినో కాదు..
  • మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వెతుకులాటలో వాతావరణం చూపుతున్న ప్రభావం..పంచాయతీ రాజ్ శాఖ, కులాల వారీగా, జనాభా లెక్కల ప్రాతిపదికన నిర్ధారించిన జాబితాలో,ఈసారి పామూరు మేజర్ పంచాయతీకి బీసీ కులాలకు ప్రాధాన్యత దక్కిన విషయం అందరికి తెలిసిన విషయం..

పామూరు, అక్టోబర్ 2(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో, తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ వాతావరణం వేడిగానే వుంది.. వాతావరణం వేడిగా ఉండటానికి కారణం ప్రకృతి విపత్తు ఎల్నినో కాదు.. మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వెతుకులాటలో వాతావరణం చూపుతున్న ప్రభావం..పంచాయతీ రాజ్ శాఖ, కులాల వారీగా, జనాభా లెక్కల ప్రాతిపదికన నిర్ధారించిన జాబితాలో,ఈసారి పామూరు మేజర్ పంచాయతీకి బీసీ కులాలకు ప్రాధాన్యత దక్కిన విషయం అందరికి తెలిసిన విషయం.. పేరుకు బీసీ రిజర్వేషన్ కానీ, ఆచరణ యోగ్యతకు నోచుకోని పరిస్థితి.. దేవుడు వరమిచ్చినా గుడిపూజారి అనుమతి కావాలి అన్న విధంగా నాయకుల వ్యవహార శైలి.. బీసీ రిజర్వేషన్ రావడం వలన, బీసీ కులాల్లో భాగమైన ముస్లిం కులానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షంషూర్ పోటీ చేయడానికి అన్నీ విధాలుగా సంసిద్ధత వ్యక్త పరిచిన విషయం పామూరు మండలస్థాయి లో అందరికి తెలుసు.. దాదాపు ఆరువేల ఓటర్లు కల్గిన ముస్లిం సామాజిక వర్గానికి అవకాశం వస్తుందని, అధిష్టానం ఆదేసిస్తుందని ఎదురుచూపు చూసి,చూసి కళ్ళు కాయలు కాసే పరిస్థితి..స్థానిక అధినాయకులు బీసీ కులాల్లో ఏ కమ్యూనిటికి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తారో అని నిరీక్షణ..మాకు వచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకొనే భాగ్యం కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు….బీసీ కులాలు కేవలం ఓటుబ్యాంక్ కాదని, భారత రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు, రిజర్వేషన్ లను చట్ట సభల్లో వినియోగించుకొని, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతామని తెలిపారు..ఎవరి అభిప్రాయాలు ఎలావున్నా, అల్లుడినోట్లో సెని ఉన్నట్టు, ప్రతిసారి బీసీ కులాలు చట్టసభల్లో వెనకబడి వున్నారని పామూరు పట్టణ ప్రజల ఆవేదన..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *