ఖానాపురం పున్నమి ప్రతినిధి:
అండర్-14 వాలీబాల్ పోటీల్లో బుధరావుపేట గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి (ఫస్ట్ ప్రైజ్) సాధించారు. క్రమశిక్షణ, సమన్వయం, పట్టుదలతో ప్రతి మ్యాచ్లో చక్కటి ఆటతీరును ప్రదర్శించి విజేతలుగా నిలిచారు. విజయం సాధించిన విద్యార్థినులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నిర్వాహకులు అభినందించారు. బాలికల క్రీడా ప్రతిభకు ఈ విజయం మరింత ప్రోత్సాహాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిఈటి దేవేందర్. ఉపాధ్యాయులు సారంగపాణి. వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ భద్రయ్య. గారు వారిని అభినందించడం జరిగింది.



