Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. పలు గ్రామాల్లో వివిధ పార్టీల మద్దతుదారుల విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. పలు గ్రామాల్లో వివిధ పార్టీల మద్దతుదారుల విజయం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
  • దుత్తలూరు మండలం రాచవారిపల్లిలో బీజేపీ మద్దతుదారుడు నంబూరి రోసిరెడ్డి 47 ఓట్లతో విజయం సాధించారు.
  • కొత్తపేటలో టీడీపీ, సోమలరాగడలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారు.

ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దుత్తలూరు మండలం రాచవారిపల్లిలో బీజేపీ మద్దతుదారుడు నంబూరి రోసిరెడ్డి 47 ఓట్లతో విజయం సాధించారు. కొత్తపేటలో టీడీపీ, సోమలరాగడలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. సీతారాంపురం మండలం దేవిశెట్టిపల్లిలో టీడీపీ, మారంరెడ్డిపల్లె, నెమలిదిన్నెలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఉదయగిరి మండలం వెంగళరావునగర్‌లో వైఎస్సార్సీపీ మద్దతుదారురాలు రజియా 147 ఓట్లతో గెలుపొందారు. జి.చెరువుపల్లెలో టీడీపీ విజయం సాధించింది. దుత్తలూరు మండలం ఏరుకొల్లులో టీడీపీ రెబల్ మద్దతుదారుడు వెంగయ్య చౌదరి 29 ఓట్లతో గెలుపొందారు. దీంతో ఆయా గ్రామాల్లో విజేతల అనుచరులు సంబరాలు చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *