Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎరువుల యాప్ విధానంతో రైతులకు ఇబ్బందులు తొలగించాలి: లక్కు కృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎరువుల యాప్ విధానంతో రైతులకు ఇబ్బందులు తొలగించాలి: లక్కు కృష్ణ ప్రసాద్

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, నవంబర్ 28 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి లక్కు కృష్ణ ప్రసాద్ కోరారు.
  • ఈ మేరకు ఆత్మకూరు సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ చైర్మన్ పరిటాల సత్యనారాయణ, మేనేజర్ శ్రీనివాసన్‌లతో ఆయన సమావేశమై నూతన విధానంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.ప్రభుత్వం ఎరువుల పంపిణీని యాప్ విధానం ద్వారా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంతో స్మార్ట్‌ఫోన్లు లేని రైతులు, నిరక్షరాస్యులు, వృద్ధులు, పేద రైతులు…
  • యాప్‌లో నమోదు, ఎరువుల బుకింగ్, క్యూఆర్ కోడ్ పొందడం వంటి ప్రక్రియలు అందరికీ సులభంగా అందుబాటులో ఉండటం లేదని తెలిపారు.ముఖ్యంగా కౌలు రైతులు, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులకు ఈ విధానం మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్నారు.

ఆత్మకూరు, నవంబర్ 28 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి లక్కు కృష్ణ ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆత్మకూరు సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ చైర్మన్ పరిటాల సత్యనారాయణ, మేనేజర్ శ్రీనివాసన్‌లతో ఆయన సమావేశమై నూతన విధానంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.ప్రభుత్వం ఎరువుల పంపిణీని యాప్ విధానం ద్వారా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంతో స్మార్ట్‌ఫోన్లు లేని రైతులు, నిరక్షరాస్యులు, వృద్ధులు, పేద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కృష్ణ ప్రసాద్ వివరించారు. యాప్‌లో నమోదు, ఎరువుల బుకింగ్, క్యూఆర్ కోడ్ పొందడం వంటి ప్రక్రియలు అందరికీ సులభంగా అందుబాటులో ఉండటం లేదని తెలిపారు.ముఖ్యంగా కౌలు రైతులు, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులకు ఈ విధానం మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్నారు. బయోమెట్రిక్ ధృవీకరణ, ఇంటర్నెట్, సర్వర్ సమస్యల కారణంగా ఎరువుల కొనుగోలులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందకపోతే సాగు పనులకు ఆటంకం కలుగుతుందని వివరించారు.యూరియా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడం ప్రభుత్వ బాధ్యతేనని, అయితే అక్రమ వ్యాపారులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోకుండా మొత్తం రైతాంగాన్ని డిజిటల్ నిబంధనలతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. గతంలో మాదిరిగా ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా కొనసాగించాలని, యాప్‌తో పాటు ప్రత్యామ్నాయంగా ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.రైతులకు ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతు సంఘాలతో చర్చించి అందరికీ అనుకూలమైన సరళమైన పంపిణీ విధానాన్ని రూపొందించాలని కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ చైర్మన్ పరిటాల సత్యనారాయణ, మేనేజర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *