*ప్రజలతోనే ప్రయాణం.. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా!*
*వైసీపీ పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించి ఓటు వేయండి*
*జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డే అభివృద్ధికి నిదర్శనమంటూ ప్రచారం*
*పొందుగల పంచాయతీలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం*
*మైలవరం,నవంబర్:- పున్నమి న్యూస్ పొందుగల
_పొందుగల గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రచారం ఊపందుకుంది._ _పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పుల్లూరు శ్రీనివాసరావు తరఫున నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు._ _ఇందులో భాగంగా వైసీపీ సర్పంచ్ అభ్యర్థి పుల్లూరు శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పొందుగల పంచాయతీ పరిధిలోని అనంతవరంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.గడపగడపకు వెళ్ళినప్పుడు ప్రజలు బ్రహ్మరధం పట్టారు._
_ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను పరిశీలించి ఓటు వేయాలని ప్రజలను కోరారు._
_వైసీపీ ప్రభుత్వ హయాంలో పొందుగల పంచాయతీకి జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా అవార్డు లభించడం గ్రామంలో గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనమని నాయకులు ప్రచారంలో ప్రస్తావించారు._ _గ్రామంలో జరిగిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను కలిశారు._
_అనంతవరం గ్రామంలో సాగిన ప్రచారంలో సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు స్థానికులతో మాట్లాడి గ్రామ సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు._ _సర్పంచ్ అభ్యర్థికి పుల్లూరు శ్రీనివాసరావు కు మద్దతుగా పార్టీ శ్రేణులు గ్రామంలో పర్యటించడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది._

