Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఖానాపూర్ మండలానికి దక్కిన అరుదైన గౌరవం.amc vice చైర్మన్ శాఖమూరి హరిబాబు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖానాపూర్ మండలానికి దక్కిన అరుదైన గౌరవం.amc vice చైర్మన్ శాఖమూరి హరిబాబు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే అరుదైన అవకాశం ఖానాపురం మండలానికి దక్కడం ఎంతో గర్వకారణమని ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు గారు హర్షం వ్యక్తం చేశారు.నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ప్రత్యేక సహకారంతో గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా, ఈ అరుదైన గౌరవాన్ని అందిపుచ్చుకున్న అశోక్ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాడి అచ్యుతం గారికి ప్రత్యేక అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజాప్రతినిధుల ప్రతిభకు మరింత గుర్తింపునిస్తాయని శాఖమూరి హరిబాబు
నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్కొన్నారు.

ఖానాపూర్ మండలానికి దక్కిన అరుదైన గౌరవం.amc vice చైర్మన్ శాఖమూరి హరిబాబు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *