Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరావు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరామర్శించిన కోగంటి సత్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరావు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరామర్శించిన కోగంటి సత్యం

మాజీ హోంమంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారిని పరామర్శించిన పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారు.

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ | 28-11-2026

మాజీ హోంశాఖ మంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావు గారి సతీమణి, మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి మాతృమూర్తి వసంత హైమావతి గారు మృతి చెందడంతో, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారు మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు గారు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారిని కలిసి శనివారం నాడు పరామర్శించారు.

ఈ సందర్భంగా హైమావతి గారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన కోగంటి సత్యం గారు, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. సతీమణిని కోల్పోయిన బాధలో ఉన్న వసంత నాగేశ్వరరావు గారు, మాతృమూర్తిని కోల్పోయిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారితో పాటు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని, మనోస్థైర్యాన్ని కలిగి ఉండాలని కోరారు.హైమావతి గారి మృతి వసంత కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.

మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరావు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరామర్శించిన కోగంటి సత్యం

మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరావు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరామర్శించిన కోగంటి సత్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *