వార్త ముఖ్యాంశాలు
- బీసీలంటే అంత చులకనా - నైతిక బాధ్యత వహించి పదవికి తప్పుకోవాలి -టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దారపనేని మాధవరావుపై సర్పంచ్ మానం రాజేశ్వరి ఆగ్రహం -యాదవులకు సర్పంచ్ పదవి రావడం దరిద్రమంటూ అవమానించారంటూ ఆరోపణ -బీసీ మహిళా సర్పంచ్‌ను కించపరిచేలా మాట్లాడటం తగదు -ఎమ్మెల్యే, ఎంపీపీ,…
- శుక్రవారం ఆమె గ్రామానికి చెందిన పలువురితో కలిసి మీడియా సమావేశ మాట్లాడారు.
- ఈ సందర్భంగా సర్పంచ్ మానం రాజేశ్వరి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో తూర్పు కోడిగుడ్లపాడు సర్పంచ్ పదవికి బీసీ సామాజికవర్గానికి చెందిన రెండు వర్గాల వారు పోటీ పడిన నేపథ్యంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జోక్యం చేసుకుని ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లుతో…
బీసీలంటే అంత చులకనా – నైతిక బాధ్యత వహించి పదవికి తప్పుకోవాలి
-టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దారపనేని మాధవరావుపై సర్పంచ్ మానం రాజేశ్వరి ఆగ్రహం
-యాదవులకు సర్పంచ్ పదవి రావడం దరిద్రమంటూ అవమానించారంటూ ఆరోపణ
-బీసీ మహిళా సర్పంచ్‌ను కించపరిచేలా మాట్లాడటం తగదు
-ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీతో పాటు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం
-మీడియా సమావేశంలో సర్పంచ్ మానం రాజేశ్వరి
పామూరు, నవంబర్ 28@9::27am (పున్నమి న్యూస్ రిపోర్టర్ )
బీసీలంటే అంత చులకనా యాదవులకు సర్పంచ్ పదవి రావడం దరిద్రమంటూ అవమానకరంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ కమిటీ అధ్యక్షుడు దారపనేని మాధవరావు నైతిక బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తూర్పు కోడిగుడ్లపాడు సర్పంచ్ మానం రాజేశ్వరి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె గ్రామానికి చెందిన పలువురితో కలిసి మీడియా సమావేశ మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ మానం రాజేశ్వరి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో తూర్పు కోడిగుడ్లపాడు సర్పంచ్ పదవికి బీసీ సామాజికవర్గానికి చెందిన రెండు వర్గాల వారు పోటీ పడిన నేపథ్యంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జోక్యం చేసుకుని ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లుతో మాట్లాడి ఇరువర్గాలను సమన్వయపరిచి ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టాలని సూచించారని రాజేశ్వరి తెలిపారు. ఈ క్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న దారపనేని మాధవరావు తమను ఫోన్ చేసి పిలిపించి మాట్లాడిన సమయంలో యాదవులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మీ యాదవులకు సర్పంచ్ పదవి రావడం మాకు దరిద్రం అంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.గత 50 సంవత్సరాలుగా పంచాయతీ పరిధిలోని గ్రామ ప్రజల ఓట్లతో ఎంతోమంది సర్పంచులుగా ఎన్నికయ్యారని ఇప్పుడు బీసీ సామాజికవర్గానికి చెందిన తాము సర్పంచ్‌గా ఉండటం ఆయనకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు.బీసీ మహిళననే కారణంతో తనను కించపరిచేలా మాట్లాడటం మానసిక క్షోభకు గురిచేయడం తగదన్నారు. పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లు చెప్పుకుంటూనే ఆ అభ్యర్థి ఆర్థికంగా దెబ్బతినడానికి ఓటమి పాలవడానికి కూడా మాధవరావు వ్యవహారశైలే కారణమని ఆరోపించారు. తనను వ్యతిరేకిస్తూ అవమానకరంగా మాట్లాడినప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తనకు వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థి ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు.
గ్రామ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఉండి బీసీ వర్గాల పట్ల ఇలాంటి వైఖరి ప్రదర్శించడం తగదని రాజేశ్వరి అన్నారు. దారపనేని మాధవరావు తక్షణమే గ్రామ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ బైరెడ్డి జాహ్నవి రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మానం మల్లికార్జున యాదవ్, చెనికల మాలకొండయ్య, మక్కా నాగరాజు, మానం నాగేశ్వరరావు, నాగేంద్ర యాదవ్, మానం కిరణ్, రంజిత్, కొండలరావు, వెంకటేశ్వరరావు, అద్దంకి మాల్యాద్రి, చెనికల రోశయ్య, తాళ్లూరి జయరావు, చుండూరి పోతయ్య, అద్దంకి బాల నాగయ్య, తాళ్లూరి రామయ్య, దేవరకొండ చెన్నకేశవులు, పోతయ్య, ఇర్ల రాజా, రమేష్, బండారు ప్రభుదాస్, తాతపూడి నరసయ్య, రోశయ్య, పాములయ్య, బండారు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.