Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎన్నికల ప్రచారానికి తెర..
  • 48 గంటల పాటు నిషేధం!
  • నెల్లూరు: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.

ఎన్నికల ప్రచారానికి తెర.. 48 గంటల పాటు నిషేధం!

నెల్లూరు: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసిందని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల వెల్లడించారు. ఈ నెల 29న ఆత్మకూరు, గూడూరు సబ్‌ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో 214 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది.పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే ఎన్నికల ప్రచారంపై పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి వచ్చాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమయంలో బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులతో పాటు సోషల్ మీడియా వేదికగా ఓటర్లను ప్రభావితం చేసే ప్రచార కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు.ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించడం, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఎస్పీ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *