వార్త ముఖ్యాంశాలు
- గ్రామస్థులతో మాట్లాడిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య ఆత్మకూరు, నవంబర్ 27 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది.
- గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో పర్యటించి గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు.
- వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, మున్సిపల్ విభాగం సెక్రటరీ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి గ్రామ పెద్దలతో మాట్లాడి ఎన్నికల పరిస్థితులపై చర్చించారు.
గ్రామస్థులతో మాట్లాడిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య
ఆత్మకూరు, నవంబర్ 27 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో పర్యటించి గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, మున్సిపల్ విభాగం సెక్రటరీ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి గ్రామ పెద్దలతో మాట్లాడి ఎన్నికల పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది.పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థులతో నాయకులు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.ఈ సందర్భంగా డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకులకు సూచించారు. గ్రామ పెద్దలతో జరిగిన ఈ సమావేశం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది