Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

53 బంతుల్లో 204 పరుగులు రికార్డుల వేటలో యువ సంచలనం – వైభవ్ సూర్యవంశీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
53 బంతుల్లో 204 పరుగులు రికార్డుల వేటలో యువ సంచలనం – వైభవ్ సూర్యవంశీ

వార్త ముఖ్యాంశాలు

  • సిక్సర్ల సునామీ సృష్టించిన సూర్యవంశీ..
  • క్రికెట్ ప్రపంచం షాక్!
  • దోహా వేదికగా జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈతో జరిగిన కీలక పోరులో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు.

సిక్సర్ల సునామీ సృష్టించిన సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచం షాక్!
దోహా వేదికగా జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈతో జరిగిన కీలక పోరులో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు, 7 ఫోర్లు ఉండటం విశేషం.కేవలం 16 బంతుల్లో అర్ధశతకం, 28 బంతుల్లోనే శతకం, 40 బంతుల్లో 150 పరుగులు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసి వన్డే తరహా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఏ జట్టు సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 254 పరుగులు సాధించి ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
15 ఏళ్ల వయసులోనే ఇలాంటి అసాధారణ ప్రదర్శన చేయడం క్రికెట్ అభిమానులను అబ్బురపరిచింది. ముఖ్యంగా 28 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచాడు. ఈ అద్భుత విజయంతో భారత్-ఏ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *