Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విశ్వనాథరావుపేటలో గండూరి శ్రీనివాసులు పార్టీ సభ్యుల అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశ్వనాథరావుపేటలో గండూరి శ్రీనివాసులు పార్టీ సభ్యుల అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • జనసేన నాయకులతో కలిసి ప్రచారం..
  • గ్రామాభివృద్ధికి 10 హామీల ప్రకటన పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి విశ్వనాథరావుపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గండూరి శ్రీనివాసులు, జనసేన పార్టీ వార్డు సభ్యుల అభ్యర్థులు, జనసేన నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

జనసేన నాయకులతో కలిసి ప్రచారం.. గ్రామాభివృద్ధికి 10 హామీల ప్రకటన

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

విశ్వనాథరావుపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గండూరి శ్రీనివాసులు, జనసేన పార్టీ వార్డు సభ్యుల అభ్యర్థులు, జనసేన నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి పది అంశాలతో కూడిన హామీలను ప్రజల ముందుంచారు. గ్రామానికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

గ్రామాభివృద్ధికి 10 హామీలు

1. గ్రామంలోని ప్రతి వీధికి సీసీ రోడ్ల నిర్మాణం చేపడతాం.
2. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
3. ప్రతి వీధిలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం.
4. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా కృషి చేస్తాం.
5. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం.
6. యువతకు క్రీడా మైదానం, క్రీడా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తాం.
7. మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం.
8. వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సహకరిస్తాం.
9. గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీల అభివృద్ధికి కృషి చేస్తాం.
10. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని గండూరి శ్రీనివాసులు తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో విశ్వనాథరావుపేటను అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వనాథరావు ఎంపీటీసీ-2 గంట నేతాజీ, జనసేన నాయకులు, వార్డు సభ్యుల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *