వార్త ముఖ్యాంశాలు
- *హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని విజయవంతం చేయండి*..
- బెల్లంపల్లి, 21 నవంబర్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నవంబర్ 23 వ తేదీ సోమవారం రోజున ఏఏంసీ గ్రౌండ్ లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం తో పాటు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష…
- ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్,మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ,ఎమ్మెల్సీ అంజిరెడ్డి,ఎమ్మెల్సీ దండే విట్టల్, సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, కోవలక్ష్మి, సేవా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొంటున్నారని తెలిపారు.
*హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని విజయవంతం చేయండి*..
బెల్లంపల్లి, 21 నవంబర్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నవంబర్ 23 వ తేదీ సోమవారం రోజున ఏఏంసీ గ్రౌండ్ లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం తో పాటు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులు కోడి రమేష్, కంటెవాడ నగేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్,మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ,ఎమ్మెల్సీ అంజిరెడ్డి,ఎమ్మెల్సీ దండే విట్టల్, సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, కోవలక్ష్మి, సేవా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో పరమ పవిత్రమైనటువంటి కార్తీకమాసంలో సోమవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల పల్లె ప్రాంత ప్రజలు, మహిళ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని శివపార్వతుల కళ్యాణం వీక్షించే అవకాశాన్ని వినియోగించుకొని కార్తీక దీపోత్సవం లో పాల్గొనాలని విన్నపించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సభ్యులు బాల సంతోష్, సూరం లక్ష్మీనారాయణ, పీక లక్ష్మణ్, కట్ల అశోక్, కాసర్ల తిరుపతి ఇతర సభ్యులు పాల్గొన్నారు..
వార్తా మూలాలు
- Punnamiపత్రికా ప్రకటన