వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: మండలంలోని గండిపాలెం, దాసరపల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది.
- గండిపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో గుంటుపల్లి మాలకొండయ్య చౌదరి నామినేషన్ దాఖలు చేశారు.
- పది వార్డుల్లో తొమ్మిది వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
ఉదయగిరి: మండలంలోని గండిపాలెం, దాసరపల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. గండిపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో గుంటుపల్లి మాలకొండయ్య చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. పది వార్డుల్లో తొమ్మిది వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాసరపల్లి పంచాయతీలో కూటమి మద్దతుతో సయ్యద్ జమృత్ జాఫర్ మొహిదీన్ ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పది వార్డులకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆ పంచాయతీ కూడా ఏకగ్రీవమైనట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.