వార్త ముఖ్యాంశాలు
- కావలి: పట్టణ పర్యటనలో భాగంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక యువతతో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు.
- పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కావలిలో పర్యటించిన ఆయన ఓ హోటల్‌లో యువతను కలుసుకున్నారు.
- ఈ సందర్భంగా స్థానిక టీమ్ సేవియర్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
కావలి: పట్టణ పర్యటనలో భాగంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక యువతతో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కావలిలో పర్యటించిన ఆయన ఓ హోటల్‌లో యువతను కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక టీమ్ సేవియర్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. గతంలో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అవార్డు పొందిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.